బుధవారం తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ నల్లగొండ నుంచి ప్రసారమైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే గడువుంది. దీంతో మల్లన్న తన ప్రచారం స్పీడ్ పెంచారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంపై మల్లన్న ఫిర్యాదు
టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగ ఓట్లు తయారు చేసిందని చీఫ్ రిటర్నింగ్ అధికారితో పాటు రాష్ట్ర ఎనికల కమిషన్‌కు కూడా మల్లన్న మంగళవారం కలిసి ఫిర్యాదు చేశారు.
వారిని స్వయంగా కలిసి పరిస్థితిని వివరించారు. ఈ వీడియోను మల్లన్న ప్రసారం చేశారు.
అభిమానంతో వచ్చిన ఓ పెద్దాయన
నల్లగొండలో తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ వ్యాన్‌ను చూసిన పెద్దాయన అక్కడికి వచ్చారు. పెదల పక్షాన నిలబడ్డ మల్లన్నకు మద్దతు తెలపాలని వచ్చినట్టు ఆ పెద్దాయన చెప్పారు.
ఎవరికి అన్యాయం జరిగినా ప్రశ్నిస్తున్నాడు కాబట్టే మల్లన్నకు ఓటేయాలను కోరుకుంటున్నట్టు ఆ పెద్దాయన చెప్పారు.
ఈ రోజు మార్నింగ్ న్యూస్
విశాఖ ఉక్కు ఉద్యమం వార్తతో మల్లన్న మార్నింగ్ న్యూస్ ప్రారంభమైంది. దేవాదుల ఎప్పటికో అన్న వార్తను మల్లన్న వివరిస్తూ.. 4 వేల కోట్లంటే కమిషన్ ఎక్కువ దొరకదని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ బడ్డెట్‌కు ముందు ఇటువంటి వార్తలు రాయించి బడ్జెట్‌లో కేటాయిస్తరు. కమిషన్ ఎత్తుకుపోతారని మల్లన్న చెప్పారు.
2004 నుంచి ఇప్పటి వరకు దేవాదుల ప్రాజెక్ట్ పూర్తికాలేదని తీవ్రంగా విమర్శించారు.
29 శాతం ఫిట్‌మెంట్
ఈ వార్తపై స్పందించిన మల్లన్న ఫిట్‌మెంట్‌పై ఇతరులు ఫిర్యాదు చేశారు. కోడ్ ఉల్లంఘన అని అడ్డుపడుతున్నారని, తనకే ఓటు వేయాలని కేసీఆర్ అంటారు.
కాబట్టి నేను కంప్లైంట్ చెయ్యనని మల్లన్న అన్నారు.
ఎట్టనన్న గెలవాలె
ఈ వార్తపై మల్లన్న మాట్లాడుతూ.. నువ్వు తలకాయ కిందికి కాళ్లు మీదికి పెట్టినా బాతాల పోషెట్టి (కేసీఆర్) వరంగల్, ఖమ్మం, నల్లగొండలో గెలవబోయేది ప్రజలే అని అన్నారు.
ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్న గెలవబోతున్నాడు అని ఆయన చెప్పారు. జీహెచ్ఎంసీ ప్రజలు కేటీఆర్ దుకాణం బంద్ చేసిండ్రు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ ప్రజలారా కేసీఆర్ దుకాణం బంద్ చేసే అవకాశాన్ని నాకివ్వండి. నాకు ఓటేయండి అని మల్లన్న విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వార్తలతో తీన్మార్ మల్లన్న ప్రజలను చైతన్యవంతులను చేశారు.