బొగ్గు గనుల్లో కార్మికులకు స్వీట్లు , క్యాలెండర్లు పంచిన ఎమ్మెల్యే

217
MLA Chandar distributes sweets and calendars
  • సింగరేణి గని కార్మికుల సంక్షేమానికి కృషి
  • సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల అమలు
  • రామగుండం ప్రజల శ్రేయస్సు కోసం కృషి
  • కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి
  • గని కార్మికులు సుఖసంతోషాలతో వర్ధిల్లాలనీ అయ్యప్పస్వామికి పూజ

రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు అందిస్తున్న సింగరేణి గని కార్మికులంటే సి.ఎం కెసిఆర్ కి అమితమైన అభిమానం అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సింగరేణి గని కార్మికులకు కారుణ్య నియామకాల ద్వారా వారసత్వ ఉద్యోగాలు అందించి సింగరేణి గని కార్మికుల కళ్లల్లో ఆనందం నింపిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ దే అని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

శుక్రవారం రామగుండం రీజియన్ 1 పరిధిలోని 2 ఇంక్లయున్ గని ఆవరణలో ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సింగరేణి గని కార్మికులకు క్యాలెండర్లు స్వీట్లు ఎమ్మెల్యే చందర్ పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ..

కరోనా సమయంలో సింగరేణి గని కార్మికుల వేతనాల్లో సగం మినహాయింపులు చేశారనీ, గత అసెంబ్లీ సమావేశాల్లో తాము కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరం కలిసి గని కార్మికులకు పూర్తి వేతనం అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించి సింగరేణి గని కార్మికులకు పూర్తిస్థాయి వేతనం అందించామని అన్నారు. సింగరేణి కార్మికన్నల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తాము ప్రజల సమస్యల పరిష్కారం కోసం గత రెండేళ్ల కాలంలో 650 రోజులు ప్రజల సమస్యల పరిష్కారం కోసమే పని చేస్తున్నామని అన్నారు.

కరోనా సమయంలో రామగుండం నియోజకవర్గంలోని ప్రజలందరిని కంటికి రెప్పలాగా కాపాడుకున్నామన్నారు. ఎంపీ అధ్యక్షతన జరిగిన రక్షణ సమావేశంలో సింగరేణి గని కార్మికుల రక్షణ విషయంలో మాట్లాడటం జరిగిందనీ, కార్మికులందరూ రక్షణ సూత్రాలు పాటిస్తూ విధులను నిర్వర్తించాలని సూచించారు. భద్రత విషయంలో కార్మికులు ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని యాజమాన్యం సూచించిన విధంగా రక్షణ సూత్రాలను పాటించాలన్నారు.

సింగరేణి గని కార్మికులు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని 24 గంటల పాటు అయ్యప్ప స్వామి శరణు ఘోష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అన్ని వర్గాల ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న టీఆర్ఎస్ పార్టీని ఏ సందర్భం వచ్చినా సింగరేణి గని కార్మికులు ఆదరించాలని ఎమ్మెల్యే కోరారు.

ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్, టీబీజీకేఎస్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, జాహిద్ పాషా, మండ రమేష్, పుట్టా రమేష్, తోడేటి శంకర్ గౌడ్, లక్కాకుల లక్ష్మన్, దాసరి నర్సయ్య, దాసరి శ్రీనివాస్, వెంకటేష్, దేవీ, లక్ష్మీనర్సయ్య, శ్రావణ్, భురుగు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు..