దేశంలో చమురు ధరలు మండిపోతున్నాయి.
దీంతో రవాణా రంగంపై ప్రభావం చూపుతూ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి.
తాజాగా పాల ధరలు పెరగనున్నాయి. మార్చి 1 నుంచి పాల ధరలు అమాంతం పెరగనున్నాయి.
ఒక లీటర్ పాల ధరపై రూ.12 వరకు పెరగనుంది. కూరగాయలతో పాటు పాల ఉత్పత్తిదారులు ఫిబ్రవరి 23న రామ మందిర్ కాలిక మాత క్యాంపస్ లో సమావేశమై పాల ధరల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 1 నుంచి ఒక లీటర్ పాలు రూ.55 వరకు పెంచాలని నిర్ణయించారు.
మార్చి 1వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
అంటే ప్రస్తుత లీటర్ పాల ధర రూ.43పై అదనంగా మరో రూ.12 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
గత ఏడాదిలోనే పాల ధరల పెంపుపై ఉత్పత్తిదారులు డిమాండ్ చేశారు.
కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పాల ధరల పెంపు వాయిదా పడింది.
కానీ ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో పాల ధరలను కూడా పెంచాలని నిర్ణయానికి వచ్చినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.