తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ల పోరం అధ్యక్షుడు, వరంగల్ జిల్లా ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్మెన్ సదానందం గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి గౌరవ శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి నివాసంలో కలిసి తెలంగాణ రాష్ట్ర మార్కెట్ చైర్మన్ల సమస్యలను మరియు మార్కెట్ అభివృద్ధి గురించి వివరించి మెమోరండం ఇవ్వడం జరిగింది.
సమస్యలపైనా మంత్రి నిరంజన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు . త్వరలో రాష్ట్రంలోని అన్నీ మార్కెట్ కమిటీ చెర్మెన్లతో ఫిబ్రవరి 7 లోపు సమావేశం ఏర్పాటు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలేరు AMC చైర్మెన్ గడ్డమీది రవీందర్ గౌడ్, అచ్చoపేట Amc చైర్మన్ సీఎం రెడ్డి, మరియు వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మా రెడ్డి, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మెన్ శ్రీధర్ శ్రీనివాస్, మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతల శ్రీనివాసరెడ్డి, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవాలాదు, గడ్డి అన్నారం Amc చైర్మన్ రాంనర్సింహ గౌడ్, భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ గౌడ్ పాల్గొన్నారు.