మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు కోవిడ్

153
Anildeshmukh Maharashtra

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కరోనా బారినపడ్డారు. తాను పరీక్ష చేయించుకోగా కొవిడ్ పాజిటివ్ అని తేలిందని మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ట్వీట్ చేసి తెలిపారు.

తనకు వైరస్ శోకిందని, అయినప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నట్టు పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

తూర్పు విదర్భ పర్యటనలో ఉన్న మంత్రి దేశ్‌ముఖ్ నాగ్‌పూర్ వచ్చిన అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని వైద్యులు చెప్పారు.

మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ప్రస్తుతం నాగపూర్ నగరంలో కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో 34,907 మందికి తాజాగా కరోనా టీకాలు వేశారు. మహారాష్ట్రలో 3,89,540 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశారు. వైరస్‌ను ఓడించిన అనంతరం తిరిగి మీ సేవలకు అంకితమవుతానని పేర్కొన్నారు.