మహంకాళి బోనాలు జులై 29, 30 తేదీల్లో

1044
mahankali-bonalu-on-july-29-and-30

హైదరాబాద్ : జంట నగరాల్లో మరికొద్ది రోజుల్లో బోనాల సందడి మొదలు కానుంది. జులై 29, 30 తేదీల్లో మహంకాళి బోనాల జాతర నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. ఇవాళ ఉదయం మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. కోటి వ్యయంతో తయారు చేసిన బంగారు బిందెతో అమ్మవారికి బోనం సమర్పిస్తామని చెప్పారు. 250 కిలోల వెండితో గర్భగుడిలో వెండి తాపం తయారు చేయిస్తామని పేర్కొన్నారు. బోనాల జాతరకు 4 వేల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వీఐపీ పాసులు ఉన్నవారికి ఈ నెల 29వ తేదీ మధ్యాహ్నం నుంచి అమ్మవారి దర్శనం కల్పిస్తామన్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.