పెద్ద చెరువులో దూకి ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడలో చోటుచేసుకొంది. ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మృతులు లక్ష్మీపురంకు చెందిన మణికంఠ(19), ఫాతిమా (17)గా గుర్తించారు. నిన్న రాత్రి ప్రేమ జంట ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని భావించి, ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.