డాక్టర్‌పై నర్సు యాసిడ్‌ దాడి…ప్రేమ వ్యవహారం

268
LoveraffairDoctor

చిత్తూరు జిల్లాలోని తిరుపతి కోర్టు ప్రాంగణంలో ఓ డాక్టర్‌పై మహిళ యాసిడ్‌ దాడికి ప్రయత్నించింది. డాక్టర్‌ ఆదర్శ్‌ రెడ్డి తనను ప్రేమించి మోసం చేశారంటూ యాసిడ్‌ దాడి చేసేందుకు మహిళ యత్నించింది. ఆదర్శ్‌ రెడ్డి స్వల్ప గాయాలతో యాసిడ్‌ దాడి నుంచి తప్పించుకున్నారు. యాసిడ్‌ దాడికి పాల్పడ్డ మహిళను తిరుపతి పశ్చిమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆదర్శ్‌ రెడ్డి వద్ద నర్సుగా పని చేస్తున్న మహిళే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఆదర్శ్‌ రెడ్డికి ఇప్పటికే వేరే మహిళతో పెళ్లి అయిందని.. మొదటి భార్య విడాకుల కేసు కోసం ఆదర్శ్‌ రెడ్డి కోర్టుకు వచ్చాడు.