ఇండియాలోనే వేగవంతంగా నడిచే రైలు ప్రారంభం ఆ రోజే!

257
First Train in India

దేశంలోనే వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఫిబ్రవరి 15న ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ఈ ఇంజిన్ రహిత రైలును జాతికి అంకితం చేయనున్నారు. ట్రైన్ 18గా పిలిచిన ఈ రైలును ఈ మధ్యే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు రైల్వే మంత్రి పియూష్ గోయల్. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలును తయారు చేశారు.

ఈ రైలు గంటలకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకొని దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 15న ఉదయం పది గంటలకు ప్రధాని ఈ రైలును ప్రారంభిస్తారు. ఆ తర్వాత కాసేపు ఆయన ప్రసంగిస్తారు. స్వదేశంలో తయారైన తొలి రైలు పట్టాలెక్కనుండటం మాకు నిజంగా గర్వకారణం అని ఓ రైల్వే శాఖ అధికారి చెప్పారు. ఈ రైల్లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. 30 ఏళ్లుగా సేవలందిస్తున్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో దీనిని ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ, వారణాసి మధ్య ఈ రైలు తిరగనుంది.