ఛాటింగ్ పేరుతో ఇంటర్ అమ్మాయికి లెక్చరర్ వేధింపులు

242
lecturer harassment

తన కోరికను తీర్చాలనీ, ఫోన్ లో చాటింగ్ చేయాలని ఓ ఇంటర్ బాలికను వేధించడం మొదలుపెట్టాడు. లేదంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. చివరికి వేధింపులు హద్దు దాటడంతో సదరు యువతి తన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.

తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటలో ఉన్న వైఎల్ఆర్ కాలేజీలో ఓ యువతి ఇంటర్ ఫస్ట్ సంవత్సరం చదువుతోంది.అదే కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్న పితాని నూకరాజు అమ్మాయిని తన కోరికను తీర్చాలని వేధించడం మొదలుపెట్టాడు. అక్కడితో ఆగకుండా అమ్మాయి ఫోన్ కు అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపుతున్నాడు. తన మాట వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు.దీంతో ఈ వేధింపులను తట్టుకోలేక బాలిక తల్లిదండ్రులకు విషయం తెలియజేసింది.బాలిక తల్లిదండ్రులు సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యువతి ఫిర్యాదుతో సదరు కీచక లెక్చరర్ పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే ఈ విషయం ఎలాగో ముందుగానే తెలుసుకున్న పితాని నూకరాజు పరారయ్యాడు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పరారీలోఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.