ఫంక్షన్‌కు రమ్మని ఇంటికి పిలిచి లెక్చరర్ వేధింపులకు పాల్పడ్డాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని చంద్రనాయక్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓల్డ్ అల్వాల్‌కు చెందిన బాధిత యువతి రాంనగర్‌లో టూరిజం కళాశాలలో చదువుతోంది. అదే కళాశాలలో కళ్యాణ్ వర్మ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.
కళ్యాణ్ వర్మ జనవరి 24న తమ ఇంట్లో ఫంక్షన్ ఉందని, యువతిని ఆహ్వానించాడు. దాంతో యువతి ఫంక్షన్‌కు వెళ్లింది.
విందు పేరిట ఆహ్వానించి తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఈ నెల 9వ తేదీన మాదాపుర్ పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.