కేటీఆర్‌ పీఏనంటూ పలు మోసాలు …మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

230
KTR PA cheat.. former Ranji cricketer arrested

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పీఏనంటూ పలు మోసాల‌కు పాల్ప‌డుతున్న‌ మాజీ రంజీ క్రికెట‌ర్ నాగ‌రాజును హైద‌రాబాద్ నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.

పలువురు వ్యాపారవేత్తలతో పాటు హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌లను లక్షల రూపాయలకు నాగరాజు చేసిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

నిందితుడు నాగరాజును వద్ద నుండి పది లక్షల రూపాయల నగదు, పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఎల్బీ స్టేడియంలో క‌టౌట్లు పెట్టాల‌ని.. 9 కంపెనీల నుంచి రూ. 39.22 ల‌క్ష‌లు నాగ‌రాజు వ‌సూలు చేశాడు.

వెబ్‌సైట్ల‌లో కంపెనీలు, ఆస్ప‌త్రుల ఫోన్ నంబ‌ర్లు సేక‌రించి ఈ మోసాల‌కు పాల్ప‌డ్డాడు.

బంజారాహిల్స్,  సనత్‌నగర్‌, మాదాపూర్, బాచుపల్లి, కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లతో పాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరులలోనూ కేసులు నమోదు అయ్యాయి.

గ‌తంలో నాగ‌రాజుపై 10 కేసులు ఉన్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.