తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ఆయా పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సైదాబాద్ ఎస్‌బీహెచ్ కాలనీలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళానానికి బీజేపీ నేత విజయశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధాని మోదీ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా మంత్రి కేటీఆర్ తప్పుడు ప్రచారం చేయడం దారుణమన్నారు.
కేంద్రం ప్రభుత్వం ఇస్తున్న కోట్లాది రూపాయల నిధులను రాష్ట్రంలో ఖర్చు చేస్తూ, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఫాంహౌస్ నుంచి పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు.
బంగారు తెలంగాణను దివాళా తీయించిన టీఆర్‌ఎ్‌సను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
ఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతవరకు కేంద్ర పథకాలు, నిధులు ఇవ్వవద్దనిఅభిప్రాయపడ్డారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం రావాలని ఆమె అన్నారు. అది ఒక్క బీజేపీతోనే సాధ్యమవుతుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.