మేం కాంగ్రెస్‌లో చేరడం లేదు

307
konda couple denies joining congress

తీన్ మార్ న్యూస్ : కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి తెలిపారు. మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ… మేం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తున్నారని వారు పేర్కొన్నారు. అయితే… అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమేనన్నారు. ఇదిలా ఉండగా… బుధవారం ఢిల్లీలో కొండా దంపతులు రాహూల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మంగళవారం పుకార్లు షికార్లు చేశాయి. వీరితోపాటు మరో మాజీమంత్రి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన నాగం జానార్థన్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే… నాగం జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు నిజమేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా కొండా దంపతులు మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి తాము కాంగ్రెస్‌లో చేరేది లేదని, టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని వివరణ ఇచ్చారు.