ఎంఐఎంకు కేసీఆర్ కొమ్ముకాస్తున్నారు: బండి సంజయ్ ఫైర్

348
KU OU destroyed by KCR: Bandi Sanjay

తెలంగాణ సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు.

భైంసాలో హింసోన్మాదం సృష్టించిన ఎంఐఎంకు ముఖ్యమంత్రి కేసీఆర్ కొమ్ముకాస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.

భైంసా దాడుల్లో గాయపడి హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ భైంసా బాధితుల పరిస్థితి హృదయవిదారకంగా ఉందని చెప్పారు.

వారికి అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వర్గాలతో చర్చించడం జరిగిందని తెలిపారు.

ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరు కూడా బాధితులను పరామర్శించలేదని దుయ్యబట్టారు.

ఒక వర్గానికి కొమ్ముకాస్తూ, ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. హిందువులపై దాడులకు ప్రోత్సహించడం దుర్మార్గమని సంజయ్ వ్యాఖ్యానించారు.