తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ట్విట్టర్ ద్వారా వైఎస్ జగన్ స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజాసేవలో చిరకాలం కొనసాగేలా దీవించాలని ప్రార్థిస్తున్నట్లు జగన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించేందుకు ముమ్మర కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా షర్మిల పార్టీపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. షర్మిల వస్తే మళ్లీ సమైఖ్య రాష్ట్రం అవుతుందని గంగుల వ్యాఖ్యానించారు.