బిజెపి పై కత్తి మహేష్ సెటైర్లు

268
kathi-mahesh-satires-bjp

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు కూడా బిజెపిపై వ్యంగ్యాస్త్రాలు విసురటం మొదలు పెట్టారు. ఇదే సమయంలో సినీ క్రిటిక్ కత్తి మహేష్ బిజెపిపై తనదైన పద్దతిలో వ్యంగ్యాస్త్రం విసిరారు. బిజెపి ప్రభుత్వంపై, కేంద్ర బడ్జెట్‌పై ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. బాహుబలి సినిమా పోస్టర్ తీసుకుని బిజెపి ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలను ఇబ్బంది పెడుతోందని వ్యంగ్యమైన వ్యాఖ్య చేశారు.

కట్టప్ప తలపై బాహుబలి కాలు

బాహుబలి సినిమాలో కట్టప్ప తలపై బాహుబలి కాలు పెడుతున్న దృశ్యాన్ని కత్తి మహేష్ పోస్టు చేసి కట్టప్పను బిజెపిగా, బాహుబలిని మధ్యతరగతిగా పోల్చి ఇది 2014 పరిస్థితి అని వ్యాఖ్యానించారు.

 

 

బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచే…

బాహుబలిని కట్టప్ప కత్తితో పొడిచే దృశ్యాన్ని తీసుకుని కట్టప్పను బిజెిగా, ప్రభాస్‌ను మధ్యతరగతి ప్రజలుగా చిత్రించి ఇది 2018 పరిస్థితి అని రాశారు. 2014, 2018ల్లో బిజెపి ప్రభుత్వంలో ప్రజలున్న పరిస్తితికి ఇది పర్‌ఫెక్టుగా సరిపోతుందని ఆయన అన్నారు.

ఏవీ లేవని కత్తి మహేష్ ..

“రాజధానికి లేవు. కేంద్ర విద్యాసంస్థలకి లేదు. గిరిజన యూనివర్సిటీకి లేదు. కేంద్రీయ  విశ్వవిద్యాలయానికి లేదు. ప్రాజెక్టులకు లేదు. లోటు బడ్జెట్ కి లేదు. ఇంక ఏముంది ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్లో!?!” అని మరో వ్యాఖ్యను మహేష్ కత్తి పోస్టు చేశారు.

ఎంపీలపై ఇలా కామెంట్..

“పనికిరాని బడ్జెట్టు. పనికిరాని ఆంధ్రా ఎం.పి లు. ఇదివరకు చేవలేదనే అనుకున్నా, ఇప్పుడు చేతకాదని కూడా అర్థం అయింది. ఈసారి బిజెపి కి ఎవరు మద్దత్తు తెలిపినా, వాళ్లకు సామాన్య ప్రజలు మద్దత్తు ఇవ్వరు” అని మహేష్ కత్తి వ్యాఖ్యానించారు.