లోకనాయకుడు కమల్ హాసన్ ఫిబ్రవరి 21న మధురైలోని ఒత్తకడై గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మక్కల్ నీధి మయ్యమ్’ గా పేరుని ప్రకటించిన అనంతరం కమల్‌హాసన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మక్కల్ నీధి మయ్యమ్ అంటే ప్రజా న్యాయ కేంద్రం (పీపుల్స్ జస్టిస్ సెంటర్) అని అర్థం. పార్టీ ద్వారా ప్రజలకి సాయం చేయాలని భావిస్తున్నానని చెప్పిన కమల్ తాను ప్రజల నుండి సలహాలు తీసుకుంటానని అన్నారు.
అయితే పార్టీకి సంబంధించిన అఫీషియల్ సాంగ్ కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. కమల్ ఈ పాటకి లిరిక్స్ అందించడమే కాకుండా సాంగ్ కూడా పాడారు. విద్యాసాగర్ కంపోజ్‌చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ తమిళనాట హల్ చల్ చేస్తుంది. మరి ఆ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.