డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ జబర్దస్త్ ఆర్టిస్ట్

395
jabardasth-tanmayi-caught-in-drunk-and-drive

నిన్న రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో జబర్దస్త్ కమెడియన్ పట్టుబడ్డాడు. శుక్రవారం రాత్రి జూబ్లీహిల్స్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టారు. దీనిలో జబర్దస్త్ తన్మయితోపాటు పలువురు ఈవెంట్ మేనేజర్స్ పట్టుబడ్డారు. వారి వాహనాలను సీజ్ చేశారు.

తన్మయ్ చాలా కాలంగా జబర్దస్త్‌ కామెడీ షో లో చేస్తున్నాడు. ఐతే ఎక్కువగా లేడీ గెటప్స్ వేస్తుంటాడు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

వెస్ట్ జోన్ పరిధిలో నిర్వహించిన ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 5 కార్లు, 2 ఆటోలు, 12 బైక్‌లను పట్టుకున్నారు.

పట్టుబడిన అమ్మాయిలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము మహమూద్ అలీ బంధువులమని.. మమ్మల్నే పట్టుకుంటారా అని దుర్భాషలాడారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఐనా న్యూసెన్స్ చేయడంతో వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.