మొదటి భార్య వేధింపులతో భర్త నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటన హైద్రాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది.
పోలీసుల కథనం ప్రకారం… మలక్‌పేట వాహెద్‌నగర్ ప్రాంతానికి చెందిన మొజం అలీఖాన్‌కు అలహాబాద్ ప్రాంతానికి చెందిన నిషాత్ ఖాన్‌తో 2003లో వివాహం జరిగింది.
ఇటీవల మొజం అలీఖాన్ మొదటి భార్యకు తెలియకుండా రెండో పెండ్లి చేసుకున్నాడు.
దీంతో మొదటి భార్య వేధిస్తుండటంతో ఆమెను పుట్టింటికి పంపించాలని అలీఖాన్ ఆదివారం సాయంత్రం పోలీసులను ఆశ్రయించాడు.
పుట్టింటికి పంపించే అధికారం తమకు లేదని.. కౌన్సెలింగ్ మాత్రమే ఇస్తామని చెప్పి పోలీసులు అలీఖాన్ ను వెనక్కి పంపించారు.
పోలీసులు తన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆవేదనతో అలీఖాన్ నిద్రమాత్రలు మింగుతున్నట్లు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అయ్యింది.
పోలీసులు గమనించి సకాలంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. నిషాత్ ఖాన్ ఫిర్యాదు మేరకు మొజం అలీఖాన్‌పై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.