తెలంగాణలో ప్రసిద్దిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామికి సోమవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.
దాదాపుగా 40 వేల మంది భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా కోడె మొక్కులు చెల్లించేందుకు ఒక్క సారిగా భక్తులు దూసుకురావడంతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సులోచన గాయపడింది.
వెంటనే బంధువులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు కోడె మొక్కులు చెల్లించడంతో రూ. 18 లక్షల ఆదాయం వఛ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.
అనంతరం సమీప బద్దిపోచమ్మ ఆలయంలో కూడా భక్తులు బావురులు తీరారు. ఒగ్గుపూజారుల జగ్గుచప్పుళ్ళతో శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంతం హోరెత్తింది.
కోవిడ్ నిబంధనలు సడలించిన అనంతరం ప్రతి సోమవారం వేములవాడకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.