మాధవన్ కొడుకు దేశానికి పతకం తెచ్చాడు

803
hero-madhavan-son-vedaant-wins-bronze-medal

కోలీవుడ్ హీరో మాధవన్ ఉబ్బి తబ్బుబ్బిపోతున్నాడు. తన కుమారుడు దేశం గర్వించే విధంగా చేశాడని ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. కాగా మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్ థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ టోర్నీలో కాంస్య పతకాన్ని సాధించాడు. భారత్ తరఫున ఈ పోటీలో పాల్గొన్న వేదాంత్ మూడో స్థానంలో నిలిచాడు. 

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన మాధవన్.. ‘‘నాకు, నా భార్య సరితకు ఇది గర్వించదగ్గ విషయం. నా కుమారుడు వేదాంత్ థాయిలాండ్ అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో మన దేశానికి కాంస్యం తీసుకొచ్చాడు’’ అంటూ కామెంట్ పెట్టాడు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు వేదాంత్‌కు శుభాకాంక్షలను తెలుపుతున్నారు.