Healing distorted child died : ప్రయివేటు ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో ఓ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం నెహ్రు నగర్ కు చెందిన నుస్రా తౌసీన్ రాత్రి అస్వస్థతకు గురైంది.
దీంతో ఆమెను కుటుంబసభ్యులు జిల్లాలోని బీలీఫ్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రికి చేరిన వెంటనే వైద్య సిబ్బంది పాపకు ఇంజక్షన్ చేసారు.
వైద్యం వికటించడంతో చిన్నారి మరోసారి అస్వస్థతకు గురైంది. అనంతరం తౌసీన్ మృతి చెందింది.
Also Read : మహిళపై కానిస్టేబుల్ వేధింపులు
అయితే పాప అస్వస్థతతో కొట్టుమిట్టాడుతున్న కూడా వైద్య సిబ్బంది పట్టించుకోలేదని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు.
చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహించిన బంధువులు బిలీఫ్ ఆస్పత్రిపై దాడి చేశారు. వైద్య సిబ్బంది కారణంగానే పాప మృతి చెందినట్టు చిన్నారి బంధువులు ఆరోపించారు.