టిక్‌టాక్‌ వీడియో పాపులర్‌ కోసం.. జీపును తగులబెట్టాడు..

310
gujarat-man-set-jeep-on-fire-friend-shot-video-for-tictok
gujarat-man-set-jeep-on-fire-friend-shot-video-for-tictok

టిక్‌టాక్‌ యాప్‌లో పాపులర్‌ కావడానికి ఓ యువకుడు తన సొంత జీపునే పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన సెప్టెంబర్‌ 2న చోటు చేసుకోగా ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. రాజ్‌కోట్‌లోని కోఠారియా రోడ్డులో ఇంద్రజిత్‌సిన్హా జడేజా(33) తన జీపుపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. అయితే జీపును తగులబెట్టిన దృశ్యాలను అతని స్నేహితుడు నైమెష్‌ గోహెల్‌(28) తన సెల్‌ఫోన్లో రికార్డు చేసాడు .

ఈ వీడియో పోలీసుల దాకా చేరడంతో సెప్టెంబర్‌ 3న జడేజా, గోహెల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిద్దరిని విచారించగా జీపు స్టార్ట్‌ కానందుకే కోపం వచ్చి తగులబెట్టానని జడేజా చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. టిక్‌టాక్‌ వీడియో కోసమే జీపుకు నిప్పంటించానని ఒప్పుకున్నాడు జడేజా. ఈ కేసులో ఇద్దరు నిందితులు బెయిల్‌పై విడుదల అయ్యారు.