మెట్రో ప్రయాణికులకు తమిళనాడు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ముఖ్యమంత్రి పళనిస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు.
మెట్రో ప్రయాణికులకు చార్జీల నుంచి ఊరట కల్పించారు. చెన్నై మెట్రో ఛార్జీలను ప్రస్తుతమున్న ఛార్జీలపై రూ. 20 తగ్గిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
తగ్గించిన ఛార్జీలు ఫిబ్రవరి 22వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే కనీస ఛార్జి రూ. 10 అలాగే ఉంటుందని పేర్కొన్నారు.
చెన్నై మెట్రోలోని అన్ని మార్గాల్లో ప్రయాణించడానికి టికెట్ ధర రూ. 70 ఉండేది. కానీ ఇప్పుడు తగ్గించిన ఛార్జీలతో ఆ ఛార్జీ రూ. 50కు తగ్గించారు.