కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వాహనదారులకు శుభవార్త చెప్పింది. కొన్ని డ్రైవింగ్ లైసెన్స్‌లతోపాటు సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేసినట్లు వెల్లడించింది.
ఈ మేరకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో 18 రకాల సేవలను పూర్తిగా ఆన్‌లైన్ చేస్తున్నట్లు తెలిపింది.
ఆధార్ ధృవీకరణతో ఈ సేవలను ఆన్‌లైన్‌లోనే పొందవచ్చని స్పష్టం చేసింది.
డ్రైవింగ్ లైసెన్స్ రెనివల్, వెహికిల్ రిజిస్ట్రేషన్, లెర్నింగ్ లైసెన్స్ లాంటి వాటి కోసం ఇక రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీస్ (ఆర్టీవో)లకు వెళ్లాల్సిన పనిలేదని పేర్కొంది.
మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్ ఖాతాలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దగా ఇబ్బంది లేకుండానే ప్రజలు ఈ సేవలు పొందడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
లెర్నర్ లైసెన్స్, డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెనివల్, లైసెన్స్, ఆర్సీలో చిరునామా మార్పు. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, మోటార్ వాహనం తాత్కాలిక రిజిస్ట్రేషన్,
పూర్తిగా సిద్ధమైన మోటారు వాహనం రిజిస్ట్రేషన్, డూప్లికేట్ సర్టిఫికెట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ తదితర సేవలు ఇక ఆన్‌లైన్ లో అందుబాటులో ఉంటాయి.