ప్రియుడితో వెళ్లిన కుమార్తెను హతమార్చిన తండ్రి!

273
Father killed daughter went boyfriend

పెళ్లయిన మూడు రోజులకే తన కూతురు ప్రియుడితో వెళ్లిపోవడంతో ఓ తండ్రి ఆగ్రహానికి గురయ్యాడు.

దీంతో ఆమెను హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్ లోని దౌసా జిల్లాలో చోటుచేసుకొంది.

పోలీసుల కథనం ప్రకారం 19 ఏళ్ల పింకీ అనే అమ్మాయికి ఇటీవలే వివాహం జరిగింది.

అయితే పెళ్లైన కొన్ని రోజులకు భర్తను వదిలేసి, తన ప్రియుడితో కలసి ఆమె వెళ్లిపోయింది.

ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి శంకర్ లాల్ సైనీ తట్టుకోలేకపోయాడు. ఆమెను హతమార్చ, నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

ఫిబ్రవరి 16న పింకీకి ఇష్టం లేకున్నా పెళ్లి చేశారని పోలీసులు తెలిపారు. పెళ్లైన మూడు రోజుల తర్వాత ఆమె తన పుట్టింటికి తిరిగి వచ్చిందన్నారు.

ఆ తర్వాత ప్రియుడు రోషన్ తో కలిసి ఫిబ్రవరి 21న వెళ్లిపోయిందని చెప్పారు.తన కుమార్తెను అపహరించారని ఆమె తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

ఆ తర్వాత పింకీ ఎక్కడుందో ఆమె కుటుంబసభ్యులు కనుక్కున్నారు. పరిసర ప్రాంతాల్లో గాలించి ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.

అప్పటికే ఆగరహంతో ఉన్న తండ్రి ఆమెను ఇంటి వద్దే హత్య చేశారు. ఈమేరకు శంకర్ లాల్ పై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.