గ్యాస్​ సిలిండర్ పేలి నలుగురికి గాయాలు

230
Four injured in gas cylinder explosion

వంటింట్లో గ్యాస్​ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలైనాయి. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

పట్టణంలోని సుగ్గులవారి తోట కాలనీకి చెందిన హస్సేన్ భార్య సల్మా మంగళవారం రాత్రి గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు.

ఉదయాన్నే గ్యాస్ పొయ్యిని అంటించగా సిలిండర్ పేలి ఇంట్లో మంటలు ఎగసిపడ్డాయి.

దీంతో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు నాజియా, ముజాయిద్ గాయపడ్డారు.గ్యాస్ సిలిండర్ పేలుడు ధాటికి ఇంట్లో వస్తువులన్నీ కాలిపోయాయి.

బంధువులు హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లి ఇద్దరు పిల్లలకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.