విద్యుత్తు షాక్ తో ఫుడ్ డెలివరీ బాయ్‌ మృతి

168
Food delivery boy dies of electric shock

హైదరాబాద్ నగరంలో నిన్న కురిసిన భారీ వర్షానికి విద్యుత్‌ వైరు రోడ్డుపై తెగిపడింది.

ఈ క్రమంలో విద్యుత్‌ తీగను తాకిన ఫుడ్ డెలివరీ బాయ్‌ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ సంఘటన నగరంలోని షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిదిలోని గోడేకికబార్‌ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది.

పాతబస్తీ చార్మినార్‌ ప్రాంతంలో నివసించే మహ్మద్‌ ముస్తాఫ్‌ఉద్దీన్‌(40) స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.

గోషామహల్‌ పాన్‌మండి నుండి మంగళ్‌హాట్‌ ప్రాంతానికి అర్ధరాత్రి వెళ్తుండగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి, ఈదురు గాలులకు విద్యుత్‌ వైర్లు తెగి అతనిపై పడ్డాయి.

దీంతో విద్యుదాఘాతానికి గురైన ముస్తాఫ్‌ ఉద్దీన్‌ అక్కడిక్కడే మృతిచెందాడు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.