ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన వెబ్‌సైట్‌లో బిగ్ షాపింగ్ డేస్ సేల్‌ను ఇవాళ ప్రారంభించింది. ఈ నెల 19వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. అలాగే టీవీలు, ఇతర అప్లయన్సెస్‌పై 75 శాతం, ఎలక్ట్రానిక్స్, యాక్ససరీలపై 80 శాతం, దుస్తులు, ఫుట్‌వేర్, హోమ్ ప్రొడక్ట్స్‌పై 40 నుంచి 80 శాతం, పుస్తకాలు, బొమ్మలు, స్పోర్ట్స్ సామగ్రిపై 80 శాతం వరకు రాయితీలను ఇస్తున్నారు. అలాగే కేవలం రూ.1కే ఆకట్టుకునే డీల్స్‌ను కిరాణా సరుకులపై అందజేస్తున్నారు. సేల్‌లో భాగంగా ఎస్‌బీఐ కార్డుతో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం వరకు అదనంగా డిస్కౌంట్ లభిస్తుంది.
బిగ్‌షాపింగ్ డేస్‌లో భాగంగా ఇంకా ‘బ్లాక్‌బస్టర్ డీల్స్’, ‘రష్ అవర్ డీల్స్’, ‘ఫస్ట్ టైం డిస్కౌంట్లు, ‘ప్రైస్ క్రాష్’ ఆఫర్లు కూడా ఉన్నాయి. రష్ అవర్ డీల్‌ను సాయంత్రం 4 నుంచి 6 మధ్య నాలుగు రోజులూ నిర్వహించనుంది. ప్రతీ ఎనిమిది గంటలకు బ్లాక్ బస్టర్ డీల్స్, ప్రైక్రాష్‌లను నిర్వహించనుంది. బజాజ్ ఫిన్‌సెర్వ్ నోకాస్ట్ 12 నెలలపాటు ఈఎంఐ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.
గతంలో రెడ్‌మి నోట్ 5 ప్రొ బేస్ వెర్షన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ.14,999 కాగ, హై ఎండ్ వెర్షన్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర 16,999 రూపాయలు . అయితే బిగ్‌షాపింగ్ డేస్ ప్రమోషనల్ సేల్ ఈవెంట్ సందర్భంగా బేస్ వెర్షన్‌ను రూ.649తో హై -ఎండ్ వెర్షన్‌ను రూ.2,649తో ఫ్లిప్‌కార్ట్ లో కొనుగోలు చేయవచ్చు.