త్వరలో అన్ని జిల్లాల్లో గొర్రెల పంపిణీ: ఎమ్మెల్సీ కవిత

222
Distribution of sheep all districts soon:Kavitha

కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం ప్రతినిధులతో హైదరాబాద్‌లో కవిత సమావేశమయ్యారు.

ఈసందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గొల్ల కురుమలు నిరంతరం టీఆర్ఎస్‌కి మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.

గతంలో ఏ ప్రభుత్వమూ చేయని సంక్షేమ కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ గొల్ల కురుమల కోసం ‌అమలు చేస్తున్నారని ఆమె చెప్పారు.

యాదవులు సీఎం గా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనన్ని నిధులు, తెలంగాణలో గొల్ల కురుమలకు కేసీఆర్ ఇచ్చారని చెప్పారు.

కామారెడ్డిలో కురుమ సంఘం భవన నిర్మాణం పూర్తయిన అనంతరం అక్కడే సభ నిర్వహిస్తామని పేర్కొన్నారు.