తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు!

150

చైనాలో పురుడుపోసుకున్న కరోనా వైరస్ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారితో ఎంతోమంది మృత్యువాతపడగా పలు దేశాల ఆర్టిక వ్యవస్థ దివాళా తీసింది. ప్రస్తుతం ఈ వైరస్ తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది.

గత 24 గంటల్లో కొత్తగా 185 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 1604కి చేరుకుంది.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,924 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,91,312 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2008 మంది ఆయా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 730 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 27 కరోనా కేసులు నమోదైనట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.