దేశంలో నాలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి.
రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో కొత్తగా 189 కేసులు నమోదయ్యాయి.
ఇదే సమయంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,453కి చేరుకుంది.
ఇప్పటి వరకు 1,632 మంది ప్రాణాలు కోల్పోయారు. 2,94,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,910 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కోవిడ్ విజృంభిస్తోంది.
మహారాష్ట్రలో మాత్రం కరోనా ఉగ్రరూపం దాల్చడంతో మళ్లీ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి.
రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి.