తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాడు. బుధవారం ఉమ్మడి నల్గొండ జిల్లా హాలియా బహిరంగ సభలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచించారు.
తాము తలుచుకుంటే కాంగ్రెస్ మిగలదని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు తెలంగాణ పేరు మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ హయాంలో కనీసం ఎరువులు, విత్తనాలు ఇవ్వలేదని మండిపడ్డారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని వంద శాతం తరిమేశామని అన్నారు.
కృష్ణా గోదావరి అనుసంధానం చేసి నల్లగొండ జిల్లా ప్రజలు కాళ్లు కడుగుతామని ఆయన స్పష్టం చేశారు. దేశంలోనే అత్యధిక వడ్లు ఎఫ్‌సీఐకి ఇస్తున్న రాష్ట్రం మనదేనాన్నారు.
నల్లగొండ జిల్లాలోని ప్రతీ గ్రామ పంచాయతీకి 20 లక్షలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. జిల్లాలోని ప్రతి మండల కేంద్రానికి రూ.30లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు.
మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ.5కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో కొత్త పింఛన్లు, నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అన్నారు.