అల్ఫోర్స్ కాలేజీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

1046
ruchitha died

ఈ రోజు ఉదయం కరీంనగర్ లోని రేకుర్తి అల్ఫోర్స్ కాలేజీ లో రుచిత అనే ఇంటర్మీడియట్ విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామానికి చెందిన రుచిత రేకుర్తి అల్ఫోర్స్ కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుతుంది. మరణించిన రుచిత శరీరం పై కాలిన గాయాలు వున్నాయి. కాలేజీ యాజమాన్యం మాత్రం రుచిత వొంటి పై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని చెబుతుంది.




 

విద్యార్థిని చనిపోయిన వెంటనే కాలేజీ యాజమాన్యం కళాశాల జీప్ లో సివిల్ ఆసుపత్రి కి తీసుకు వెళ్లారు. అమ్మాయి తల్లిదండ్రులకు ఆలస్యంగా సమాచారమిచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఆగ్రహించిన విద్యార్ధి సంఘాలు ఆందోళన చేపట్టారు. పోలీసులు విద్యార్థులను చెదరగొట్టారు. గతంలో నాలుగు నెలల క్రితం ఇదే కళాశాలలో పీ ఈ టి కరంట్ షాక్ తో మృతి చెందాడు. ప్రస్తుతం కళాశాల గేట్లు మూసి వున్నాయి. మృతురాలి స్నేహితులెవరు అందుబాటు లో లేరు.