నేడు హాలియాలో కేసీఆర్ బహిరంగ సభ

229
CM KCR Visits Nalgonda today

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరుగునన్న నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని హాలియాలో భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు.

దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాల నేపథ్యంలో ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్ పార్టీ సీరియస్‌గా తీసుకుంది.

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో సాగర్‌లో ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ గట్టి పట్టుదలగా ఉంది.

గులాబీ బాస్ కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచనున్నారు. ఈ బహిరంగసభకు ఉమ్మడి నల్గొండ నుంచి పెద్ద ఎత్తున జనాలను సమీకరిస్తున్నారు

కేసీఆర్ తొలుత సాగర్ చేరుకుని అక్కడి డ్యామ్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత నెల్లికల్లులో ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు.

అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు హాలియాలో బహిరంగ సభలో మాట్లాడతారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కల్లపల్లి రవీందర్‌రావు మరియు

మాజీ విప్‌ కర్నె ప్రభాకర్‌ సహా పలువురు నేతలు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.