ముఖ్యమంత్రి జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు – ఎంపీపీ చిలుక రవీందర్

197
cm birthday

ఈరోజు చొప్పదండి మండలం లోని రాగంపేట గ్రామంలో గల శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా స్వామి దేవాలయంలో న్యాలకొండ వారి కుటుంబ సభ్యులు ప్రతి యేటా నిర్వహిస్తున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా స్వామి వారి వార్షిక బ్రహ్మోస్తవలలో భాగంగా నేడు సుదర్శన నరసింహ హోమము, మహాపూర్ణ హతి, కుంబ బ్రోక్షణ,చక్ర స్నానం కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు చిలుక రవీందర్ గారు హాజరై మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ గారి జన్మదిన సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దేశ్ కి నేత, కార్యధిక్షపరులు, ఉద్యమ నేత, అలుపెరుగని దిరుడు మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి ఆ దేవ దేవుని ఆశీషులు కలగాలని ప్రత్యేక పూజలు చెయ్యడం జరిగింది. ఆ తరువాత BC ఇంటిగ్రాటెడ్ హాస్టల్ లో వార్డెన్ సత్యం గారి అద్వర్యం లో KCR గారి పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చెయ్యడం మరియు పళ్ళ పంపిణి చెయ్యడం జరిగింది. ఆ తరువాత పట్టణ అధ్యక్షులు లోక రాజేశ్వర్ రెడ్డి గారి అద్వర్యం లో జరిగిన కేక్ కటింగ్ లో ముఖ్య అతిధిగా హాజరవడం జరిగింది.

వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం చుక్క రెడ్డి గారి అద్వర్యం లో జరిగిన ముఖ్య అతిధిగా పాల్గొని మొక్క నాటడం జరిగింది.

chiluka ravinder

ఈ కార్యక్రమంలో ZPTC మాచర్ల సౌజన్య గారు, మున్సిపాలిటీ చైర్మన్ గుర్రం నీరజ గారు, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గుంట రవి గారు, వివిధ గ్రామాల సర్పంచులు పెద్ది శంకర్,లింగంపల్లి లావణ్య, తాళ్లపల్లి సుజాత-శ్రీనివాస్,మున్సిపాలిటీ కౌన్సెలర్స్ కొత్తూరి మహేష్, మాధురి శ్రీనివాస్, నల్లమచ్చు జ్యోతి-రామకృష్ణ, కొత్తూరి స్వాతంత్ర భారతి-నరేష్, AMC డైరెక్టర్స్ వడ్లురి భూమయ్య, మల్లేశం, శ్రీనివాస్, మధు, న్యాలకొండ కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.