కరోనా కేసులపై కేంద్రం నిర్లక్ష్యం: రాహుల్​ ఫైర్

158
Tamil BJP Complaints Rahul to EC

కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు.

దేశంలోకి కొత్త రకం కరోనా  ప్రవేశించిన సంగతి తెలిసిందే.ఇప్పటివరకు బ్రిటన్ రకం కరోనా కేసుల  187కు చేరుకొంది.

తాజాగా దక్షిణాఫ్రికా, బ్రెజిల్ రకం కరోనా కూడా దేశంలోకి ప్రవేశించినట్టు కేంద్రం ప్రకటించింది.

బ్రెజిల్ రకం కరోనా కేసు ఒకటి, దక్షిణాఫ్రికా రకం కరోనా కేసులు నాలుగు నమోదైనట్టు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ ప్రకటించారు.

ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ఇలా జరిగిందని విమర్శించారు.

కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వ అతి విశ్వాసమే నష్టాన్ని కలిగించిందన్నారు. కరోనా ఇంకా పూర్తిగా పోలేదని రాహుల్ వ్యాఖ్యానించారు.