కాల్వ‌లోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

411
car crashed canal killing three people

తెలంగాణలోని జ‌గిత్యాల జిల్లాలో సోమ‌వారం తెల్ల‌వారు జామున రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించింది.

జ‌గిత్యాల నుంచి జోగిన‌ప‌ల్లికి వెళ్తున్న కారు మేడిపల్లి ఎస్సారెస్పీ కాలువలోకి ప్రమాదవశాత్తు దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ముగ్గురు మృతి చెంద‌గా, ఒక‌రు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.కారులో ఉన్నవారు జగిత్యాల జిల్లాకు చెందిన న్యాయ‌వాది అమరేందర్ రావు కుటుంబంగా గుర్తించారు.

అమ‌రేంద్ర‌రావు త‌న భార్యా, కుమారుడు, కూతురుతో క‌లిసి జోగిన‌ప‌ల్లికి దైవ‌ద‌ర్శ‌నం కోసం బ‌య‌ల్దేరారు.

తెల్ల‌వారుజామున 3 గంట‌ల స‌మ‌యంలో కారు ఎస్సారెస్పీ కాలువ‌లోకి దూసుకెళ్ల‌డంతో అమ‌రేంద్రావుతో పాటు భార్య శిరీష‌, కూతురు శ్రేయ గ‌ల్లంతు అయ్యారు. కుమారుడు జ‌యంత్ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.

అమరెందర్ రావు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమీప బంధువు, ఎమ్మెల్యే తండ్రి న్యాయవాది హన్మంతరావు వద్ద జూనియర్ న్యాయవాది గా పని చేసేవాడు.

విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సంజయ్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.

విషయం తెలిసిన పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని క్రేన్ స‌హాయంతో కాలువలో నుంచి మృతదేహాలను వెలికి తీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.