కాల్వ‌లో ప‌డిన బ‌స్సు.. 22 మంది మృతి

189
car crashed into a canal .. Two killed one lost!

కాల్వ‌లో ప‌డిన బ‌స్సు.. 22 మంది మృతమ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఘోర బ‌స్సు ప్ర‌మాదం చోటు చేసుకుంది.

సిధి జిల్లా ప‌ట్నా మీదుగా ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ బ‌స్సు అదుపుత‌ప్పి కాల్వ‌లో ప‌డింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు.

ఆ స‌మ‌యంలో బ‌స్సులో దాదాపు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. బ‌స్సు కాల్వ‌లో ప‌డిన అనంత‌రం ఏడుగురు ప్ర‌యాణికులు చాకచక్యంగా తప్పించుకొని సుర‌క్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

మిగతా ప్రయాణీకుల కోసం స‌హాయ‌క బృందాలు గాలిస్తున్నాయి. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకొన్నారు.

ఈ ఘోర ప్రమాదంలో  మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. ఈ ఘ‌ట‌న‌పై మరింత సమాచారం  తెలియాల్సి ఉంది.