పాపులర్ ఐపీఎల్ టోర్నమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు టెలికాం కంపెనీల రేసులో బీఎస్‌ఎన్‌ఎల్ కూడా చేరిపోయింది. స్పెషల్ ఐపీఎల్ ప్లాన్‌గా 258 రూపాయలతో ఓ సరికొత్త ప్యాక్‌ను ఆవిష్కరించింది. 51 రోజుల వాలిడిటీతో ఈ ప్యాక్‌పై 153 జీబీ డేటా ఆఫర్ చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. తమ ప్రీపెయిడ్ మొబైల్ కస్టమర్లకు ఎస్‌టీవీ రూ.258పై 51 రోజుల వాలిడిటీతో అపరిమిత డేటా, రోజుకు 3జీబీ డేటాను అందించనున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది. తక్కువ రేటుకు లైవ్ ఐపీఎల్ మ్యాచ్‌లను స్ట్రీమ్ చేసుకునేందుకు తమ సబ్‌స్క్రైబర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది.
మూడు రోజుల క్రితమే రిలయన్స్ జియో కూడా ఐపీఎల్ సందర్భంగా రూ.251 ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీ ఎయిర్‌టెల్ కూడా హాట్‌స్టార్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చని తెలిపింది. బీఎస్‌ఎన్‌ఎల్ కేవలం 3జీ నెట్‌వర్క్‌నే కలిగి ఉండగా.. జియో 4జీ సర్వీసులను అందించనుంది. ప్యాన్ ఇండియా బేసిస్‌లో 2018 ఏప్రిల్ 7 నుంచి 2018 ఏప్రిల్ 30 వరకు ఆ ఆఫర్ పరిమిత సమయంలో అందుబాటులో ఉండనుంది.