బ్యూటీ పార్లర్ నుంచి వధువు పరార్!

230
Girl loves four people Lucky draw wedding!

గురువారం పెళ్లికి ముహూర్తం ఖరారైంది. బుధవారం సాయంత్రం రిసెప్షన్ కు అన్ని ఏర్పాట్లు  చేశారు. వరుడు వచ్చి వేదికపైన కూర్చున్నాడు, కానీ వధువు మాత్రం  రాలేదు.

అలంకరణ కోసం బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఆమె కోసం బంధువులంతా ఎదిరిచూశారు.

అయినప్పటికీ చాలాసేపటి వరకు ఆమె రాకపోయేసరికి వరుడి కుటుంబసభ్యులు ఆవేశంతో మండిపడ్డారు.

దీంతో వారంతా వివాహ మండపంలోనే గొడవకు దిగారు. ఈ ఘటన చెన్నై శివారు ప్రాంతంలోని పూందమల్లి సమీపంలోని చెంబరం పాక్కంలో జరిగింది.

ఈ రోజు ఉదయం వధూవరులకు వివాహం జరగాల్సి వుంది. నిన్న రాత్రి ఏర్పాటు చేసిన రిసెప్షన్ కు రావాల్సిన అమ్మాయి ఎంత సేపటికి  రాలేదు.

బ్యూటీ పార్లర్ కు వెళ్లిన ఆమె, అటు నుంచి అటే పరారైనట్టు తెలుస్తోంది.ఈ విషయం తెలుసుకున్న వధువు తరఫు బంధువులు కూడా మొహం చాటేశాడు.

ఆమె కావాలనే పారిపోయిందని భావించిన వరుడి బంధువులు ప్లెక్సీలు, బ్యానర్లు చింపేశారు.

తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ వరుడి బంధువులు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు  చేసుకున్న పోలీసులు యువతి బంధువులను విచారిస్తున్నారు.