ఆదివారం ఉదయం కేరళలోని ఇడుక్కి జిల్లాలోని చిన్నార్ చెక్-పోస్ట్ వద్ద అటవీ అధికారుల కోలాహలం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళ మరియు తమిళనాడు బార్డర్ వద్ద అక్రమ వాహనాలను తనిఖీ చేయాల్సిందిపోయి వివాహ మండపం (వేదిక) ఏర్పాటు చేయడం, దండలు శుభ్రపరచడం, చేతి శానిటైజర్లను సిద్ధంగా ఉంచడం లాంటి పనులతో హడావుడిగా ఉండటం చూసి అందరు ఆశ్చర్యం మరియు ఆనందంలో మునిగిపోయారు.
ఇంతకీ విషయం ఏమిటంటే అక్కడ అంతరాష్ట్ర వివాహం నిర్వహించడం. కోయంబత్తూరుకు చెందిన రాబిన్సన్, ఇడుక్కిలోని మున్నార్ నివాసి ప్రియాంక పెళ్ళికి రెండు రాష్ట్రాల సరిహద్దు వేదికయ్యింది.
చిన్నార్ చెక్ పోస్ట్ వద్ద అధికారులు ఎదురుచూస్తుండగా, వరుడు రాబిన్సన్ తెల్ల చొక్కా మరియు వెష్టి ధరించి తమిళనాడు సరిహద్దు నుండి నడుచుకుంటూ నడిచాడు. అలాగే కేరళ వైపు నుండి వధువు ప్రియాంక బంగారు ఎంబ్రాయిడరీతో ఆకుపచ్చ చీర ధరించి నడుస్తూ వచ్చింది..
ఈ జంట తమిళనాడు మరియు కేరళ బార్డర్ లోని చిన్నార్ (ఇడుక్కి) ఎక్సైజ్ చెక్‌పోస్ట్ ముందు కలుసుకుని వివాహం చేసుకున్నారు.
అధికారులు చెక్-పోస్ట్ ఆఫీస్ ముందు రహదారిపై ఒక చాపను వేసి దానిపై దీపం మరియు పండ్లు వంటి ఇతర వస్తువులను ఏర్పాటు చేశారు. శారీరక దూరపు ప్రోటోకాల్‌ను పాటిస్తూ వధువు మరియు వరుడి కుటుంబాలు ఈ జంట నుండి దూరంగా ఉండమని కోరారు. కుటుంబ సభ్యులందరికీ పాస్‌లు పొందడం సాధ్యం కానందున, సరిహద్దు వద్ద వివాహం ఏర్పాటు చేయబడింది.
బంధువులందరూ కొంచెం దూరం నుండి చూస్తుండగా, చెక్-పోస్ట్ అధికారులు రాబిన్సన్‌కు, ప్రియాంక కు చేతులు శుభ్రం చేయడానికి కొంత హ్యాండ్ శానిటైజర్ ఇచ్చి, ముహూర్తం సమయానికి అనగా ఆదివారం ఉదయం 8.30 మరియు 8.45 మధ్య నూతన వధూవరులకు పరిశుభ్రమైన దండలు, మరియు తాలి అందజేశారు, ఈ తతంగం అంత పూజారి లేకుండానే జరిగింది. అయితే ఈ కార్యక్రమం అంతా మరయూర్ హెల్త్ సెంటర్ జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ మజీద్ ఆధ్వర్యం లో , అవసరమైన అన్ని COVID-19 ప్రోటోకాల్లను అనుసరించి వివాహం జరిగింది అని చెక్-పోస్ట్ అధికారులు తెలియజేసారు.
సరిహద్దు ఆంక్షల కారణంగా, ప్రియాంక తన వెంట తీసుకెళ్లిన సామాను తో ఆమె మండపం నుండి తన భర్తతో తమిళనాడు సరిహద్దు వైపు వెళ్ళిపోయింది. “ఇది మాకు విచారకరమైన క్షణం” అని ప్రియాంక తండ్రి శేకర్ చెప్పారు.
ప్రియాంక (25) కొచ్చిలో నర్సుగా పనిచేస్తుండగా, రాబిన్సన్ (30) న్యూ ఢిల్లీ లో పనిచేస్తున్నాడు. అతను ఆరు నెలల క్రితం తమిళనాడుకు వచ్చినపుడు ఈ వివాహం నిశ్చయమైంది. అయితే వీరి వివాహం మార్చి 22 న కోయంబత్తూరులోని శరవణపట్టిలోని ఒక ఆలయంలో జరగాల్సింది. ఇరు కుటుంబాలు వివాహ సరంజామా, ఆభరణాలతో సిద్ధంగా వున్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించే వరకు వివాహ ఆహ్వానాలను కూడా పంపిణీ చేశాయి.
“మేము దాదాపు రెండు నెలలు కోయంబత్తూర్ వెళ్ళడానికి పాస్ కోసం ప్రయత్నించాము కాని ప్రయోజనం లేకపోయింది. కార్కిడకా మాసం (కేరళ ప్రజలకు శుభ మాసం) త్వరలోనే సమీపిస్తున్నందున మరియు ఈ సీజన్‌లో వివాహాలకు అనుమతి లేదు కాబట్టి, పెళ్లి నిర్వహించడానికి మాకు అనుమతి ఇవ్వమని మరోసారి అధికారులను అభ్యర్థించాము. చివరగా, మాజీ దేవికులం ఎమ్మెల్యే ఎకె మణి సహాయంతో కలెక్టర్ నుండి మాకు పాస్ వచ్చింది ”అని అమ్మాయి తండ్రి శేఖర్ అన్నారు.
సంబంధిత కలెక్టరేట్లు జోక్యం చేసుకున్న తరువాత, ప్రియాంక తమిళనాడు వెళ్ళడానికి పాస్ పొందగలిగింది మరియు రాబిన్సన్ కేరళలోకి ప్రవేశించడానికి పాస్ పొందగలిగాడు. చిన్నార్ చెక్ పోస్ట్ నుండి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని కటలై మరియమ్మన్ ఆలయంలో జూన్ 7 న వారి పెళ్లి తేదీని మరోసారి నిర్ణయించారు.
అయితే, వారు మరోసారి వేదికను మార్చాల్సి వచ్చింది. తమిళనాడులో పెరుగుతున్న COVID-19 కేసుల కారణంగా, సరిహద్దు ఆంక్షలు కఠినంగా అమలు చేయబడుతున్నాయని జూనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ అబ్దుల్ మజీద్ చెప్పారు.
కేరళలో వివాహాలు నిర్వహించడానికి మేము తమిళనాడు వ్యక్తులకు పాస్ ఇవ్వలేము. కాబట్టి కేరళ-తమిళనాడు సరిహద్దులో వివాహాన్ని నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. వరుడు మండపం చేరుకున్నప్పుడు, తల్లిదండ్రులను మాత్రమే దగ్గరకు రమ్మని అనుమతించాము. కేరళ-తమిళనాడు సరిహద్దు వద్ద నిలబడి ఉన్న వేడుకకు ఇతర కుటుంబ సభ్యులు సాక్ష్యమిచ్చారు ”అని అబ్దుల్ అన్నారు.
పెళ్లి తర్వాత ఆమె తమిళనాడుకు బయలుదేరడానికి ఆమె సూట్‌కేస్‌ను తీసుకెళ్లమని వధువు కుటుంబానికి తెలియజేసాము. సాధారణంగా, తమిళ సంస్కృతిలో, వివాహ వేడుక తరువాత, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం ఒక ముఖ్యమైన చర్య. అయినప్పటికీ, COVID-19 పరిమితుల కారణంగా, మేము దీనికి కుటుంబ సభ్యులను అనుమతించలేదు, ”అని ఆయన అన్నారు.
“లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా సడలించిన తర్వాత, మేము ప్రియాంకను కలుసుకుని మరో చిన్న వేడుకను నిర్వహిస్తాము” అని శేకర్ చెప్పారు.