బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డీఎంకే ఎంపీ కనిమొళిని ఓ అక్రమ సంతానంగా అభివర్ణిస్తూ ఆయన తమిళంలో చేసిన ట్వీట్ ఇప్పుడు పెను దుమారం రేపుతున్నది. తమిళనాడు గవర్నర్ ఓ జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించడాన్ని తప్పుబడుతూ కనిమొళి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజా ఈ ట్వీట్ చేశారు. పదో తరగతి కూడా పాస్ కాకుండా పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోవడం ఏంటి అంటూ నిలదీసిన అన్నామలై యూనివర్సిటీ విద్యార్థి ఉదయ్‌కుమార్‌ను హత్య చేసిన కుటుంబం ఇప్పుడు దీనిపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అని ఓ ట్వీట్‌లో రాజా అన్నారు.
10 ம் வகுப்பு கூட படிக்காத ஒருவர் தன் பேருக்கு முன்னால் டாக்டர் என்று போட்டுக் கொள்ள விரும்பிய அல்ப்ப ஆசைக்கு எதிர்ப்பு தெரிவித்த காரணத்தால் அண்ணாமலை பல்கலைக் கழக மாணவன் உதயக்குமாரை கொலைசெய்த குடும்பம் இன்று கொந்தளிப்பது வேடிக்கை தான்
— H Raja (@HRajaBJP) April 18, 2018
ఆ తర్వాత గవర్నర్‌ను ఆ మహిళా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నను ప్రస్తావిస్తూ మరో ట్వీట్‌లో దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అక్రమ సంబంధం ద్వారా వచ్చిన తన అక్రమ సంతానాన్ని ఎంపీని చేసిన ఆ నేతను ఇదే ప్రశ్న జర్నలిస్టులు అడుగుతారా? అడగలేరు.. ఎందుకంటే వాళ్లు భయపడతారు. చిదంబరం ఉదయ్‌కుమార్, అన్నానగర్ రమేష్, పెరంబలూర్ సాదిక్ బాషాలను ఏం చేశారో వాళ్లకు తెలుసు అని రాజా ఆ ట్వీట్‌లో రాశారు.
தன் கள்ள உறவில் பெற்றெடுத்த கள்ளக் குழந்தையை (illegitimate child) மாநிலங்களவை உறுப்பினராக்கிய தலைவரிடம் ஆளுநரிடம் கேட்டது போல் நிருபர்கள் கேள்வி கேட்பார்களா. மாட்டார்கள். சிதம்பரம் உதயகுமார், அண்ணாநகர் ரமேஷ், பெரம்பலூர் சாதிக் பாட்ஷா நினைவு வந்து பயமுறுத்துமே.
— H Raja (@HRajaBJP) April 18, 2018
రాజా ఈ ట్వీట్‌లో ప్రస్తావించిన ముగ్గురినీ కరుణానిధి, ఆయన కుటుంబం హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి మహిళా జర్నలిస్ట్‌తో అలా ప్రవర్తించడం సరికాదని కనిమొళి మంగళవారం ఓ ట్వీట్ చేశారు. దీనిని తప్పుబడుతూ రాజా చేసిన ట్వీట్ మరింత దుమారం రేపింది. ఆయన కామెంట్స్‌ను ట్విట్టర్‌లో చీల్చి చెండాడుతున్నారు నెటిజన్లు.