వాట్సాప్ హ్యాక్ అవుతోంది..జర భద్రం..

315
beware! chinese hackers hacking whatsapp

స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండేందుకు దోహదపడుతున్న సోషల్ మెసేజింగ్ సైట్. అయితే, ఇప్పుడు దుండగులు వాట్సాప్‌పై గురి పెట్టారు. పొరుగు శత్రు దేశం చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా భారత ఆర్మీ ప్రకటించింది. వాట్సాప్‌ను దేశ ప్రజలు భద్రంగా, సురక్షితంగా వాడుకోవాలని సూచించింది. వాస్తవాధీన రేఖ వెంబడి విధులు నిర్వర్తించే సైనికులు వాట్సాప్ వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన నాలుగు నెలలకే.. ఈ తాజా హెచ్చరికను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి ట్విట్టర్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు ఆర్మీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ ఫేస్.



 

డిజిటల్ ప్రపంచంలోకి చైనా హ్యాకర్లు చొరబడుతున్నారని, హ్యాక్ చేసి సమగ్ర సమాచారాన్ని దోచేస్తున్నారని ఆ వీడియోలో హెచ్చరించారు. అలా చొరబడేందుకు చైనా హ్యాకర్లు అందుబాటులో ఉన్న అన్ని ప్లాట్‌ఫాంలను వాడుకుంటున్నారని హెచ్చరించారు. వాట్సాప్ గ్రూపుల్లో చేరిపోయి ఫోన్లను, వాట్సాప్‌ను హ్యాక్ చేస్తున్నట్టు తెలిపారు. +86 కోడ్‌తో గ్రూపుల్లో యాడయ్యే ఫోన్ నంబర్లు చైనాకు సంబంధించినవని, అలా గ్రూపుల్లోకి చొచ్చుకొచ్చిన తర్వాత వారికి కావాల్సిన సమాచారాన్ని మొత్తం దొంగిలిస్తున్నారని హెచ్చరించారు. కాబట్టి గ్రూప్ అడ్మిన్లు ఎప్పటికప్పుడు గ్రూపులను చెక్ చేసుకుంటూ ఉండాలని, చైనా కోడ్‌తో వచ్చే నంబర్లపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఒకవేళ సిమ్ కార్డు మారిస్తే పాత సిమ్‌ను పూర్తిగా విరగ్గొట్టేయాలని వీడియోలో సూచించారు.