బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌

402
TS new president

తెలంగాణ భాజపా కొత్త అధ్యక్షుడిగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ నియామకం అయ్యారు. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. మొదట లక్ష్మణ్ నే మళ్లీ కొనసాగిస్తారని ప్రచారం జరిగినా చివరికి సంజయ్ వైపే భాజపా అధినాయకత్వం మొగ్గు చూపింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన సంజయ్‌ కుమార్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం సంజయ్ తో పాటు ధర్మపురి అరవింద్, డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తదితరులు పోటీ పడ్డారు. ఆశావహులు భాజపా పెద్దలతో సైతం తమ ప్రయత్నాలు కొనసాగించినట్లు సమాచారం. అయితే ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీలో పనిచేసిన అనుభవం కలిసిరావడంతో బండి సంజయ్ కు అధ్యక్ష పదవి వరించింది.

MP Bandi Sanjay

2019 లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన సంజయ్ ఎంపీగా గెలుపొందారు. 2005లో కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో 48వ డివిజన్‌ నుంచి కార్పొరేటర్ గ గెలుపొందారు. సంజయ్‌. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ కొనసాగారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ అధిష్టానం తెలియజేసింది.