అత్త వివాహేతర సంబంధం భరించలేక ఓ అల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్ నగరంలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తూటిపేట తండాకు చెందిన అంగోతు బాబు (25) ఎనిమిది నెలల క్రితం పెళ్లి చేసుకున్నాడు.
క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ నందనవనం కాలనీలో భార్య నిర్మలతో జీవనం గడుపుతున్నాడు.
కొంతకాలంగా భార్య తల్లి విజయ(40) శ్రీను అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొంది.
దీంతో శ్రీను ప్రతి రోజు తన ఇంటికి రావడం గమనించాడు. అనుమానంతో నిలదీయగా అసలు విషయం తెలిసింది.
దీంతో బాబు పది మందిలో పంచాయితీ పెట్టడంతో ఓర్చుకోలేని అత్త విజయ, శ్రీనులు బాబుకు ఫోన్ చేసి బెదిరించారు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురై చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.