అక్క వెంటపడి అసభ్యంగా ప్రవరిస్తున్న ఆకతాయిలను అడ్డుకున్న బాలుడిపై దుండగులు కత్తులతో దాడి చేశారు.
ఈ ఘటనఈశాన్య ఢిల్లీలోని కాకాజీ ఏరియాలోచోటుచేసుకొంది.
బాలుడి కుటుంబసభ్యులు వెంటనే అతడిని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి అక్క ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
బాధితురాలు కథనం ప్రకారం.. తాను తన సోదరుడు కలిసి శుక్రవారం పని నిమిత్తం బయటకు వెళ్తుండగా ముగ్గురు యువకులు వారిని వెండించారు.
బాధితురాలితో అసభ్యంగా మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో బాధితురాలి తమ్ముడు వారిని ఎదిరించగా ముగ్గురు కలిసి అతనిపై దాడికి పాల్పడ్డారు.
అనంతరం అతడిని కత్తులతో కడుపులో పొడిచి పారిపోయారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.