న్యాయవాదిపై ఇద్దరు యువకుల దాడి

250
Attack of two young men on a lawyer

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో హైకోర్ట్ న్యాయవాద దంపతుల హత్య ఘటన మరువక ముందే వరంగల్ అర్బన్ జిల్లాలో ఓ న్యాయవాదిపై ఇద్దరు యువకులు దాడి చేశారు.

ఈ ఘటన జిల్లాలోని హన్మకొండలో హంటర్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎం వద్ద చోటుచేసుకుంది. ఈ దాడిలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వేణు స్వల్పంగా గాయపడ్డారు.

న్యాయవాది ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఏటీఎం వద్ద ఏర్పడిన వాగ్వాదం వల్ల ఈ దాడి జరిగిందని సమాచారం.

రాష్ట్రంలో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. న్యాయం కోసం కృషి చేసే వారిపై జరిగే దాడులను ఖండిస్తున్నారు.