కరోనా వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ టీచర్ మృతి

209
Anganwadi teacher dies corona vaccine

జనవరి 16న దేశవ్యాప్తంగా ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. ఈ వ్యాక్సిన్ ను తొలుత వైద్య సిబ్బందికి, అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని భద్రాద్రి జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ వికటించి అంగన్‌వాడీ టీచర్ మృతి చెందారు.

జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడులో అంగన్‌వాడీ టీచర్ చిన్నీ నాలుగు రోజుల క్రితం కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.

అనంతరం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

గత నాలుగు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన చిన్నీ పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు.